Kaizer News

Penamaluru: పెనమలూరు పేరు రాష్ట్రంలో మారుమోగాలి!

Penamaluru: పెనమలూరు పేరు రాష్ట్రంలో మారుమోగాలి!

· State - Telangana · hmtvlive.com

Shorts Penamaluru: పెనమలూరు పేరు చెబితే గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలి… రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ‘పెనమలూరు నుంచి వచ్చాం’ అని చెప్పగానే ‘బోడే ప్రసాద్ మీ వాడేగా!’ అని గుర్తుపట్టేలా పనిచేయాలి! ఇదే తన సంకల్పమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గానికి కేవలం రాజకీయంగా కాకుండా అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆదరణలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ… “మన పెనమలూరు” అనే మాటకు ప్రత్యేక గౌరవం వచ్చేలా కృషి చేస్తానన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకమే తనకు పెద్ద బాధ్యత అని పేర్కొన్న బోడే ప్రసాద్… ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని, పెనమలూరు ప్రజలు తమ ప్రాంతం గురించి గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెనమలూరు అభివృద్ధే లక్ష్యం… ప్రజల గౌరవమే సంపద… ప్రజల నమ్మకమే తన బలం అన్న రీతిలో బోడే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తికర చర్చకు దారితీశాయి

Original source: hmtvlive.com
Read more on Kaizer News