నవీపేట/ మాక్లూర్: రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్‌ను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం ప్రతినిధులు శనివారం తహసీల్దార్ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. యూరియా యాప్‌తో సకాలంలో యూరియా అందక రైతులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల నుంచి సాగునీటిని సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేవేందర్ సింగ్, నాయకులు కిషన్, గంగాధర్ పాల్గొన్నారు. ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పెట్టిన యూరియా యాప్‌లో బుక్ చేసుకున్న పది నిమిషాల వ్యవధిలోనే యూరియా ఖాళీ అవుతుందని మండిపడ్డారు. కల్లెడికి 300 సంచుల యూరియా వస్తే అవసరం అయ్యే రైతులు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే యూరియా అయిపోవడంపై రైతులు మండిపడుతూ కొద్ది సేపు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. వెంటనే యాప్‌ను తొలగించి ప్రతి ఎరువుల దుకాణంలో యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చే శారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం