Kaizer News

చాంపియన్ల జోరు

చాంపియన్ల జోరు

· National - India · ntnews.com

సమర్‌కండ్‌: ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్లు అదరగొడుతున్నాయి. ఓపెన్‌, మహిళల విభాగంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌.. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లోనూ అదే జోరును కొనసాగించింది. ఓపెన్‌ విభాగంలో 3-1తో ఇటలీని ఓడించిన భారత్‌.. విమెన్‌ సెక్షన్‌లో 3.5-0.5తో గ్రీస్‌ను చిత్తుచేసింది. ఓపెన్‌ కేటగిరీలో నిహాల్‌ సరిన్‌, గుకేశ్‌ తమ ప్రత్యర్థులను ఓడించగా ప్రజ్ఞానంద, అర్జున్‌ డ్రాలతో సరిపెట్టుకున్నారు. అమ్మాయిల విషయానికొస్తే కోనేరు హంపి, వంతిక అగర్వాల్‌, సవిత శ్రీ గెలుపు జోరును కొనసాగించగా దివ్య దేశ్‌ముఖ్‌ గేమ్‌ డ్రా గా ముగిసింది

Original source: ntnews.com
Read more on Kaizer News