Kaizer News

సుప్రీంకు దానం నాగేందర్‌..

సుప్రీంకు దానం నాగేందర్‌..

· State - Telangana · prabhanews.com

హైకోర్టు తీర్పుపై సవాల్‌ ఎల్లుండి పరిశీలనకు వచ్చే అవకాశం ఇప్పటికే కేవియట్‌ దాఖలు చేసిన బీఆర్ఎస్‌ హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పార్టీ ఫిరాయింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ఎల్లుండి పరిశీలనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో స్పీకర్‌ నిర్ణయాన్ని కొట్టి వేస్తూ.. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో తదుపరి న్యాయపోరాటంపై దానం నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన దానం నాగేందర్‌ శుక్రవారం మాట్లాడుతూ.. తీర్పును స్వాగతిస్తున్నానని తెలిపారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం నేపథ్యంలో బీఆర్ఎస్‌ ఇప్పటికే అప్రమత్తమైంది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దంటూ సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది

Original source: prabhanews.com
Read more on Kaizer News