> Pakistan Lockdown : పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. ధరలు పెరిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ కూలిపోయి.. అప్పు పుడితే తప్ప కడుపు నిండని పరిస్థితి కనిపిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆ దేశ జనాల కడుపు కొడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. సామాన్య జనాలు వాటిని అసలే కొనలేకపోతున్నారు. ప్రపంచం అంతా అప్పులు చేస్తున్న పాక్.. ఆ నిధులను ఉగ్రవాదులను మేపడానికే ఉపయోగిస్తోంది. జనాల ఆకలిని, సమస్యలను గాలికి వదిలేస్తోంది. మంచి ఆహారానికి కూడా జనాలు దూరం అవుతున్నారంటే.. అర్థం చేసుకోవచ్చు ఆ దేశంలో పరిస్థితి ! . భారత్, చైనాకు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన ట్రంప్.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ఇంధన వ్యయం పాక్ ఎకానమీని చావుదెబ్బ కొడుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి పాక్ ప్రభుత్వం అత్యంత కఠినమైన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశంలో ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా.. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కీలక నిబంధనలతో స్మార్ట్ లాక్ డౌన్ అమల్లోకి తెచ్చింది. మిడిలీస్ట్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో.. ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది పాకిస్థాన్ ప్రభుత్వం పొదుపు చర్యలు ప్రకటించడం ఇది రెండోసారి. ఇప్పుడు ప్రకటించిన చర్యలు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయి. ఇంధన ధరల పెరుగుదలను కంట్రోల్ చేసేందుకు పాక్ సర్కార్ కీలక ఆంక్షలు విధించింది. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనాన్ని తగ్గించనున్నారు. ప్రభుత్వం కొత్త వాహనాలు కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది. ప్రభుత్వ అధికారులు విదేశీ పర్యటనలు చేయకుండా ఆంక్షలు విధించారు. ఇక విదేశీ అతిథులు, ప్రతినిధి బృందాలకు ఇచ్చే విందులు మినహా.. ప్రభుత్వ అధికారిక విందులపై నిషేధం విధించారు. ఐటీకి సంబంధించిన కొనుగోళ్లను మినహాయించి.. ప్రభుత్వం కొనుగోలు చేసే దీర్ఘకాలిక వస్తువులపై ఆంక్షలు విధించారు. సమావేశాలను ప్రత్యక్షంగా నిర్వహించకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలని సూచించారు. వ్యాపార సంస్థల పని వేళలను కూడా తగ్గించారు. దేశవ్యాప్తంగా ఉన్న షాపింగ్ మాల్స్, మార్కెట్లను రాత్రి 9 గంటలకే మూసివేయాల్సి ఉంటుంది. మెడికల్ షాపులు, ల్యాబ్‌లకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. వివాహ మండపాలు రాత్రి పదింటికి, రెస్టారెంట్లు రాత్రి 11 గంటలకు క్లోజ్ చేయాలి. పెళ్లిళ్లకు వచ్చేవారికి విందులో కేవలం ఒకే ఒక్క వంటకం మాత్రమే వడ్డించాలని స్పష్టమైన నిబంధన విధించింది. జనాల బాధలను పట్టించుకునే ప్రభుత్వమే పాకిస్థాన్‌లో ఎప్పుడూ లేదు. ప్రపంచం అంతా అప్పులు చేయడం.. ఆ నిధులను ఉగ్రవాదం మీద ఖర్చు చేయడం.. జనాల సమస్యలను కనీసం పట్టించుకోకపోవడం.. ఇవన్నీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం పాక్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. దీంతో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. ఆహార సంక్షోభం ఏర్పడి.. పౌష్టికాహారం అగమ్యగోచరంగా మారింది. పాక్ జీడీపీలో అప్పుల భారం 70 నుంచి 80శాతానికి చేరింది. సంపాదనలో ఎక్కువ భాగం