Kaizer News

Srikalahasti: సీఎం చంద్రబాబు నాయుడుకు MGM ఫ్యామిలీ

Srikalahasti: సీఎం చంద్రబాబు నాయుడుకు MGM ఫ్యామిలీ ఘన స్వాగతం!

· State - Telangana · hmtvlive.com

Srikalahasti: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివారం ఉదయం శ్రీకాళహస్తిలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి MGM హాస్పిటల్ హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి MGM గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ గారు, ఆయన సతీమణి శ్రీమతి గుడ్లూరు ఐశ్వర్య గారు కుటుంబ సభ్యులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతం పలికిన MGM ఫ్యామిలీ సభ్యులు, ఆయనతో కొద్దిసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News