అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించడం శుభపరిణామం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వసంతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కొండపల్లి పట్టణ అభివృద్ధికి మంజూరైన రూ.96 కోట్లతో రూపురేఖలు మారనున్నాయని మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు తెలిపారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించడం శుభపరిణామం అన్నారు. పట్టణ ప్రజల తరఫున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మున్సిపల్ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.32 వేల కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కొండపల్లిలో మౌలిక సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, కౌన్సిలర్లు చనమోలు నారాయణ, అమ్మాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కరిమికొండ బాలాజీ తదితరులు పాల్గొన్నారు