Kaizer News

ఈ-–కేవైసీ ఉంటేనే జీతం..ఉపాధి స్కిల్డ్ లేబర్ కు కేం

ఈ-–కేవైసీ ఉంటేనే జీతం..ఉపాధి స్కిల్డ్ లేబర్ కు కేంద్రం కొత్త రూల్

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (వీబీ– జీ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ) పనిచేసే స్కిల్డ్, సెమీ-స్కిల్డ్ కార్మికులకు ఇకపై వేతనం పొందాలంటే కేంద్రప్రభుత్వం ఈ– -కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఈ నిబంధన ప్రకారం ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయితేనే ఈ-మస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేరు నమోదై, పని ప్రదేశంలో హాజరు పడుతుంది. ఆ తర్వాత పనుల కొలతల అనంతరం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమవుతాయి. ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సోమవారం నుంచే అమల్లోకి తెస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో దీని అమలుపై అస్పష్టత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 76,659 మంది స్కిల్డ్ లేబర్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 79 మందికి మాత్రమే ఈ-కేవైసీ పూర్తయింది. అంతేకాకుండా, రాష్ట్రంలోని సగానికి పైగా అంటే 16 జిల్లాల్లో ఒక్కరికి కూడా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోవడంతోపాటు, తాము చేసిన పనికి వేతనాలు రావేమోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన నూతన నిబంధనల ప్రకారం వేతన ప్రక్రియ అంతా పూర్తిగా డిజిటల్ వ్యవస్థతో ముడిపడి ఉంది. ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాగిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ–మస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరేట్ కావాలంటే కూలీకి ఈ–కేవైసీ తప్పనిసరి. ఒకవేళ కేవైసీ లేకపోతే సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వారి పేర్లను తిరస్కరిస్తుంది. పని ప్రదేశంలో మేట్లు తమ మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల ఫేస్ అథెంటికేషన్ చేసి హాజరు వేయాల్సి ఉంటుంది. అయితే, ముందస్తుగా ఈ–కేవైసీ పూర్తి కాకపోతే ఈ యాప్ హాజరును అంగీకరించదు. ఇలా పడిన హాజరు ఆధారంగానే టెక్నికల్ అసిస్టెంట్లు మూడు రోజుల్లోగా పనుల కొలతలు రికార్డు చేస్తారు. ఆ తర్వాత ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీవోలు జనరేట్ అయి ఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఐఎస్, పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐల ద్వారా నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లోకి వేతనం జమవుతుంది. అయితే, ఈ వ్యవస్థలో మొదటి దశ అయిన ఈ–కేవైసీ ప్రక్రియే పూర్తికాకపోతే, వేతన బిల్లులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 76,659 మంది స్కిల్డ్, సెమీ–స్కిల్డ్ కూలీలు ఉండగా, వారిలో 46,707 మందికి మాత్రమే ఆధార్ వివరాలు అనుసంధానమయ్యాయి. అయితే, యూఐడీఏఐ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా పూర్తి చేయాల్సిన ఫేస్ అథెంటికేషన్ ఈ–కేవైసీ ప్రక్రియలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఏకంగా 16 జిల్లాల్లో ఒక్క కూలీకి కూడా ఇప్పటివరకు ఈ–కేవైసీ పూర్తి కాలేదు. జిల్లాల వారీగా పరిశీలిస్తే భద్రాద్రి కొత్తగూడెంలో 3,435 మంది, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Original source: v6velugu.com
Read more on Kaizer News