Kaizer News

Siddipet: నేరాల నియంత్రణకు ప్రతి ఇంటికి సీసీ కెమెర

Siddipet: నేరాల నియంత్రణకు ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు: ఏసీపీ!

· State - Telangana · hmtvlive.com

Shorts Siddipet: నేరాలు నియంత్రణకు సీసీ ప్రతి ఇంటికి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి, వన్టౌన్ సిఐ మహేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో 3 లక్షల వ్యయంతో సుమారు పదహారు కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కొక్క కెమెరా 1000 కన్నులతో సమానం అన్నారు. కేసుల చేతనకు కెమెరాలు ఎంతగానో దోహదపడతాయి అన్నారు. నేరస్తుల కదలికలు ఉట్టిగాను పసిగట్ట వచ్చనీ అన్నారు. వార్డులోని ప్రతి ఇంటికి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కెమెరా ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాల గాని, ఎలాంటి క్రైమ్ చేయాలన్న చేసేవాడికి భయం ఉంటుందని తెలిపారు. కెమెరాలు ఏర్పాటు చేయడం కాదు వాటిని మెయింటెనెన్స్ పై కూడా దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ రెడ్డి విజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ బోనాల రామస్వామి మాజీ ఎంపీటీసీలు కదుర్ల బాలయ్య బండి రంగయ్య, బండారుపల్లి శ్రీనివాస్ వార్డ్ సభ్యులు మెరుగు మహేశ్ ,మెరుగు రాజు,పిన్నింటి రామచంద్రారెడ్డి,పోచమ్మ గారి శ్రీనివాసరెడ్డి, పోతుల మహేష్, నరేష్, తాటికొండ శ్రీనివాస్,కొండపాక సత్తిరెడ్డి, ప్రశాంత్ మాధవ్, అశోక్, కనుగు రాజు, కెమ్మసరం శ్రీనివాస్, దుంపేటీ దేవరాజు, పోతుల మోహన్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News