వెల్దండ, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి హాజరై విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పర్వతాలు, ఉప సర్పంచ్ నరసింహ, నాయకులు బొజ్జయ్య, అల్లాజీ, కొండల్, లింగం, మల్లేష్, శ్రీశైలం, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రాజు, జంగయ్య, కొండల్ యాదవ్, చంద్రశేఖర్‌తో పాటు ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు