భగత్‌సింగ్ నగర్‌లో విషాద ఘటన లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లక్షెట్టిపేట పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లో చోటుచేసుకుంది. లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ కథనం ప్రకారం.. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రాల జయకర్ (40), గురువారం ఇంట్లో గొడవలు జరగడంతో తన సోదరులకు ఫోన్ చేసి మనస్తాపం వ్యక్తం చేశాడు. అనంతరం ఇంటి సమీపంలోని వేప చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుడి సోదరుడు గుర్రాల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు లక్షెట్టిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు