Kaizer News

మోదీ బర్త్‌డేకు గైర్హాజరైన విద్యార్థులకు రూ.500 జరిమానా!

· National - India · ntnews.com

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించే దీపారాధన కార్యక్రమానికి గైర్హాజరైన విద్యార్థులను ఐఐఎం జమ్ము శిక్షిస్తున్నదని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ సయ్యద్‌ నాసీర్‌ హుస్సేన్‌ ఆరోపించారు. ఈ కార్యక్రమానికి హాజరుకాని విద్యార్థులు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, లేదా రూ.500 జరిమానా చెల్లించాలని ఐఐఎం జమ్ము విద్యార్థి కౌన్సిల్‌ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. దీనికి శుక్రవారం డెడ్‌లైన్‌ విధిస్తూ జారీ చేసిన నోటీస్‌ను ఆయన సామాజిక మాధ్యమంలో షేర్‌ చేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News