Shorts Paderu: పాడేరు డిపో, నుండి కుజబంగి వరకు పొడిగించిన నూతన బస్సు సర్వీస్ ను రేపు ప్రారంబించునున్నారు.ఈ నూతన బస్సు సర్వీసును ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారాస్తులు,విద్యార్థుల విజ్ఞప్తి మేరకు, పాడేరు డిపో నుండి అరకు–గుంటసీమ వరకు ఇప్పటివరకు నడుస్తున్న బస్సు సర్వీసును "కుజబంగి" వరకు పొడిగిస్తూ నూతన బస్సు సర్వీసును ప్రారంభించడం జరుగుతుందని పాడేరు డిపో మేనేజర్ తెలిపారు. ఈ నూతన బస్సు సర్వీసును రేపు కుజబంగి వద్ద ఆర్టీసీ చైర్మన్ సియ్యారి దొన్ను దొర, కిడారి శ్రావణ్ కుమార్ (జి.సి.సి. ఛైర్మన్)ల ఆధ్వర్యంలో అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు పాడేరు డిపో అధికారులు తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. పాడేరు డిపో మేనేజర్ ఎన్. శ్యామ్ సుందర్ నాయుడు , డి.వి. శ్రీనివాస్ (ఆఫీస్ సూపరింటెండెంట్), ఇతర సెక్షన్ ఇన్-ఛార్జీలు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు, నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU) డిపో సెక్రటరీ S.R. బాబు మరియు ఎంప్లాయీస్ యూనియన్ (EU) సెక్రటరీ S.P. రావు , ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సదవకాశన్ని చుట్టుప్రక్కల ప్రాంత ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఈ నూతన బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకొని, పాడేరు డిపో ఆర్టీసీ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని .జిల్లా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, ఎ.పి.ఎస్.ఆర్.టి.సి., పాడేరు డిపో మేనేజర్ కోరారు