Kaizer News

సలీం మృతి పార్టీకి తీరని లోటు..

సలీం మృతి పార్టీకి తీరని లోటు..

· State - Telangana · prabhanews.com

నాంపల్లి, ఆంధ్రప్రభ: బీఆర్‌ఎస్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎం.డి. సలీం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం పార్టీకి తీరని లోటని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు అన్నారు. ఆదివారం సలీం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్ కార్యకర్తల ద్వారా సేకరించిన రూ.1.30 లక్షల ఆర్థిక సహాయాన్ని సలీం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గుమ్మడపు నరసింహారావు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, సలీం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, పోగుల వెంకట్‌రెడ్డి, కడారి శ్రీశైలం, నక్క చంద్రశేఖర్, ఇట్టెం వెంకట్‌రెడ్డి, పూదరి సైదులు, భాసిపాక రాములు, రామావత్ శంకర్‌నాయక్, ముడవత్ లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News