Kaizer News

వెంకంపల్లి శివారులో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రా

వెంకంపల్లి శివారులో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు

· State - Telangana · prabhanews.com

నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ: నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం ఉదయం పంట పొలాలకు వెళ్తున్న ఓ రైతుకు దూరంగా చిరుత కనిపించినట్లు గ్రామ సర్పంచ్ భర్త సురేందర్‌రెడ్డి, గ్రామస్తులు తెలిపారు. చిరుతను చూసిన రైతు భయంతో వెంటనే గ్రామానికి చేరుకుని విషయాన్ని స్థానికులకు తెలియజేశారు. దీంతో కొందరు గ్రామస్తులు అక్కడికి వెళ్లి పరిశీలించగా, చిరుత సమీపంలోని గుట్టపైకి వెళ్లినట్లు తెలిపారు. చిరుత సంచారం వార్తతో గ్రామస్తులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నామని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని అటవీశాఖ రేంజ్ అధికారి వాసుదేవ్‌కు సమాచారం అందించారు. చిరుత సంచారంపై అటవీశాఖ సిబ్బందిని పంపించి పరిశీలించి, పూర్తి వివరాలు సేకరిస్తామని ఆయన ఆంధ్రప్రభకు తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News