విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ ఎదురుగా రోడ్డుపక్కన పెద్ద సంఖ్యలో చినిగిన కరెన్సీ నోట్లు కనిపించడంతో స్థానికుల్లో కలకలం రేగింది. వాకర్స్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లతో పాటు ఎల్‌ఐసీ రసీదులు, ఓ మహిళకు చెందిన పాన్ కార్డు కూడా లభించాయి. నోట్లు అక్కడికి ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు