Kaizer News

రాత్రి భోజనం ఆలస్యం.. ఆరోగ్యంపై ప్రభావం !

రాత్రి భోజనం ఆలస్యం.. ఆరోగ్యంపై ప్రభావం !

· Health · prabhanews.com

ఐవా నివేదికలో కీలక విషయాలు.. హైదరాబాద్‌లో పెరుగుతున్న లేట్‌ డిన్నర్‌ కల్చర్‌.. ఆరోగ్యంపై ప్రభావం.. హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న పని ఒత్తిడి.. సుదీర్ఘ ప్రయాణాలు.. ఇవన్నీ కలిపి నగర జీవనంలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, తగిన శారీరక శ్రమ లేకపోవడం, అధికంగా కెఫిన్‌ తీసుకోవడం వంటి అలవాట్లు భారతీయుల మెటబాలిక్‌ వెల్నెస్‌పై ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి టచ్‌ ఆధారిత మెటబాలిక్‌ వెల్నెస్‌ ట్రాకర్‌ ఐవా (EYVA) విడుదల చేసిన ‘ఇండియా వెల్నెస్‌ ఇండెక్స్‌ 2026’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 30 వేల మందికి పైగా ఐవా వినియోగదారుల నుంచి సేకరించిన 35 లక్షలకుపైగా రీడింగ్‌లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. పట్టణ ప్రాంతాల్లో జీవనశైలి మార్పులు ఆరోగ్యం, నిద్ర, గుండె స్పందన, గ్లూకోజ్‌ స్థాయులపై చూపుతున్న ప్రభావాలను ఇందులో వివరించారు. హైదరాబాద్‌లోని ఉద్యోగస్తుల జీవనశైలిని పరిశీలించినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమీక్షలో పాల్గొన్న ఉద్యోగుల్లో సుమారు 64 శాతం మంది రాత్రి 10 గంటల తర్వాతే తమ చివరి భోజనం చేస్తున్నట్లు తేలింది. ఆలస్యంగా రాత్రి భోజనం చేసే వారిలో సాధారణ స్థాయిలతో పోలిస్తే నిద్ర నాణ్యత తగ్గడం, మరుసటి రోజు ఉదయం గ్లూకోజ్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు కనిపించినట్లు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే.. సుమారు 54 శాతం మంది రాత్రి 9 గంటల తర్వాతే అధిక మోతాదులో భోజనం చేస్తున్నట్లు గుర్తించారు. మెట్రో నగరాల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపించింది. ఉద్యోగ రీత్యా ఆలస్యంగా ఇళ్లకు చేరుకోవడం, సుదీర్ఘ ప్రయాణాలు, కుటుంబ సభ్యులందరూ ఒకే సమయంలో భోజనం చేయాలనే అలవాటు కారణంగా రాత్రి భోజన సమయం మరింత ఆలస్యమవుతోందని నివేదిక తెలిపింది. ఐవా వ్యవస్థాపకుడు, సీఈఓ సునీల్‌ మదికట్ల మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో ఆలస్యంగా ఇంటికి చేరుకోవడం వల్ల కుటుంబంలోని ఇతర సభ్యుల భోజన సమయాలు కూడా మారుతున్నాయని, ఇది మొత్తం కుటుంబ దినచర్యపై ప్రభావం చూపుతోందని తెలిపారు. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల ఆరోగ్య సూచికల్లో మెరుగుదల కనిపించినట్లు నివేదిక తెలిపింది. భోజనం అనంతరం చిన్న నడక వంటి శారీరక శ్రమ చేసిన వారిలో సుమారు 37 శాతం మందికి గ్లూకోజ్‌ స్థాయులు 12 నుంచి 16 శాతం వరకు తగ్గినట్లు, నిద్ర నాణ్యత కూడా మెరుగుపడినట్లు గుర్తించారు. అయితే, సుమారు 25 శాతం మంది అధిక కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఉన్న అల్పాహారాలను తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఇది మరుసటి రోజు వెల్నెస్‌ స్కోర్లపై ప్రభావం చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది. నిద్రకు ఆరు గంటల ముందు వరకు కెఫిన్‌ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని అధ్యయనం తెలిపింది. సుమారు 40 శాతం మంది వినియోగదారులు నిద్ర సమయానికి ఆరు గంటల లోపే కెఫిన్‌ తీసుకున్నట్లు గుర్తించారు. ఆలస్య భోజనం, కెఫిన్‌, ఒత్తిడి వంటి అంశాలు రాత్రిపూట గుండె స్పందన పెరగడానికి కారణమవుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితిని ఐవా ప్రతినిధులు ‘మెటబాలి

Original source: prabhanews.com
Read more on Kaizer News