Kaizer News

Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మ

Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల

· National - India · ntvtelugu.com

and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల : --> Add as a preferred source on google Gold and Silver Price Today: బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి.. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,420 పెరిగి రూ.1,55,990కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,300 పెరిగి రూ.1,43,000గా నమోదైంది. ముంబైలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,420 పెరిగి రూ.1,55,840కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,300 పెరిగి రూ.1,42,850గా కొనసాగుతోంది. ఇక, వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఢిల్లీ, ముంబై మార్కెట్లలో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,55,000కు చేరుకుంది. దీంతో వరుసగా రెండో రోజు బులియన్ మార్కెట్‌లో ధరల పెరుగుదల కనిపించింది. ఇక, హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో రూ.1,580 పెరిగి రూ.1,54,420కు చేరుకుంది 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. ఇదే సమయంలో రూ.1,450 పెరిగి రూ.1,41,550కి ఎగసింది.. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర.. మరోవైపు.. రూ.1,190 పెరిగి.. రూ.1,15,820గా ఉంది.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఇక, వెండి రూ.5000లు పెరగడంతో కిలో వెండి ధర రూ.2,60,000కు పెరిగింది.. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం కొనసాగుతుండటం, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లపై సంకేతాలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న రుణభారం వంటి అంశాలు బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితుల్లోనూ బంగారం తన బలాన్ని కొనసాగిస్తోందని SMC Global Securities కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందనా భారతి పేర్కొన్నారు. మరోవైపు నాలుగో త్రైమాసికంలో భారత్, చైనా, యూరప్‌లో పండుగల సందర్భంగా సంప్రదాయ బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషణలు సూచిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల కదలికలు మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి

Original source: ntvtelugu.com
Read more on Kaizer News