Markapuram: కులమతాలకు అతీతంగా ఏటా ఐకమత్యంతో నిర్వహించుకునే మొహర్రం పర్వదినాన్ని ఇకపై అందరం కలిసి చేసుకునే అవకాశం ఉండదంటూ ముంపు గ్రామం కలనూతల వాసులు బోరున విలపించారు. తమ గ్రామాన్ని, తమ అనుబంధాలను, తరతరాలుగా కలిసి జరుపుకుంటున్న పండుగ సంప్రదాయాలను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో గ్రామస్తులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన మొహర్రం వేడుకల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కలనూతల గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అక్కడ హృదయ విదారకంగా మారాయి