ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో ఉద్యోగ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ రూల్స్-1993కు మార్పులు చేస్తూ, 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త నిబంధనలను తీసుకువచ్చారు. రవాణా శాఖలోని ఆర్టీఓ, ఎంవీఐ నుంచి ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్ల వరకు అన్ని ఉద్యోగాలను స్థానిక కేడర్లుగా మార్చారు. ఈ మేరకు నియామక యూనిట్లను జోన్లు, మల్టీ జోన్లు, రెవెన్యూ జిల్లాల వారీగా ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త విధానం ప్రకారం […]