Kaizer News

చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

· State - Telangana · prabhanews.com

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామం వైన్స్ సమీపంలోని చెట్ల పొదల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీ. మన్మధ కుమార్ తెలిపారు. ​ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పెట్రోల్ మొబైల్-2 సిబ్బంది (హెచ్‌సీ-1226 సైదయ్య, హెచ్‌జీ-720) సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.​పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడి వివరాలు లభించాయి. మృతుడు గుంటూరు జిల్లా, తోట్లవల్లూరు మండలం, కొమ్మునూరు గ్రామానికి చెందిన వేల్డర్ పనిచేసే అన్నావరపు నాగరాజు (35) గా పోలీసులు గుర్తించారు. ​మృతికి గల కారణాలపై కేసులు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News