Kaizer News

Karimnagar: కరీంనగర్‌లో ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్

Karimnagar: కరీంనగర్‌లో ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష.. 1,471 మంది హాజరు!

· State - Telangana · hmtvlive.com

కరీంనగర్: పరీక్ష నిర్వహణను ఆదివారం కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సంయుక్తంగా పర్యవేక్షించారు. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ప్రవేశం, భద్రతా తనిఖీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, బయోమెట్రిక్ ధృవీకరణ, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. పరీక్ష సజావుగా జరిగేలా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయగా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ నీట్ పిజి పరీక్ష నిర్వహణలో భాగస్వాములైన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల నీట్ పరీక్ష విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. పరీక్ష సజావుగా సాగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ పరీక్ష పారదర్శక నిర్వహణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పరీక్షలు రాసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 7 పరీక్షా కేంద్రాల్లో 1505 మంది అభ్యర్థులకు గాను 1471 మంది హాజరుకాగా, 34 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష నిర్వహణలో జిల్లా విద్యాశాఖ అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసు అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News