Kaizer News

ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా

ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్

· State - Telangana · telugu.abplive.com

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ఖరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం 28 జిల్లాల్లో తుది జాబితాను సెప్టెంబర్ 19న ప్రచురించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం కలెక్టర్ల ఆమోదంతో ఈ జాబితా విడుదలైంది. ఓటర్ల జాబితాల ప్రక్రియ కూడా పూర్తవగా, నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. AP Local Body Elections | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను శనివారం (సెప్టెంబర్ 19న) ప్రచురించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (AP SEC) అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 09న సర్య్కులర్ జారీ చేసి పోలింగ్ కేంద్రాల ప్రక్రియను ప్రారంభించారు. ఆ షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రజా వినతులు, అభ్యంతరాల స్వీకరణ నిర్వహించారు. అనంతరం సెప్టెంబర్ 16న మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (MPDO) ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించిన అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు ఈ పోలింగ్ స్టేషన్ల తుది జాబితాకు ఆమోదం తెలిపారు. కలెక్టర్ల ఆమోదముద్ర వేయడంతో శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల తుది నివేదికను అందుబాటులో ఉంచారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక పోరుకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకున్నట్లయింది. ఎన్నికల కసరత్తు ఇతర వివరాలు పోలింగ్ కేంద్రాల ఖరారుతో పాటుగా ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓటర్ల జాబితాలను కూడా ఎన్నికల సంఘం ప్రదర్శించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కేంద్రాల ఖరారు కంటే ముందే.. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) లో కూడా పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ఎస్‌ఈసీ ఇటీవల పూర్తి చేసింది. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తయినందున, త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తాజా కీలక ముందడుగు ఏమిటి? రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 28 జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల తుది జాబితాను సెప్టెంబర్ 19న ప్రచురించింది. ఇది ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించడంలో భాగంగా చేపట్టిన చర్య. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ప్రజా వినతులు, అభ్యంతరాల స్వీకరణ తర్వాత, వాటిని పరిశీలించి, జిల్లాల కలెక్టర్లు ఆమోదించాక జాబితాను ఖరారు చేశారు.

Original source: telugu.abplive.com
Read more on Kaizer News