Kaizer News

Telangana Congress Nominated Posts: అధికారంలోకి వచ

Telangana Congress Nominated Posts: అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పోస్టుల్లేవ్ - కాంగ్రెస్ కేడర్ నిర్లక్ష్యం వెనుక అసలు కథ!

· State - Telangana · telugu.abplive.com

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా, ప్రభుత్వంలో భాగస్వామ్యం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఆశించిన ఫలితం దక్కడం లేదు. కార్పొరేషన్ ఛైర్మన్లు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థలు, దేవాలయ ట్రస్ట్ బోర్డులు, డీసీసీబీలు, పీఏసీఎస్ వంటి వందలాది నామినేటెడ్ పోస్టులు నేటికీ అరకొరగానే భర్తీ కావడం లేదా పెండింగ్‌లోనే పడి ఉండటం గులాబీ శ్రేణులను ఓడించి హస్తం జెండాను ఎగురవేసిన కేడర్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అంతర్గత విభేదాలకు తోడు సొంత కేడర్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల కాంగ్రెస్‌లో నిరసన జ్వాలలు క్రమంగా రగులుతున్నాయి. కార్యకర్తలకు పదవులు ఇప్పించేందుకు ఆసక్తిగా లేని ఎమ్మెల్యేలు గాంధీభవన్‌లో ఇన్‌ఛార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి నిర్ణయాల అమలులో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ 70% కంటే ఎక్కువ నామినేటెడ్ పోస్టులను పార్టీ కోసం కష్టపడిన పాత కార్యకర్తలకే కేటాయిస్తామని స్పష్టం చేస్తున్నప్పటికీ, ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్‌ఛార్జుల నుంచి సిఫార్సుల జాబితాలు సకాలంలో రాకపోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని పార్టీ వర్గాల మాట. ప్రభుత్వం సాధించిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కేడర్.. పదవుల విషయంలో అలసత్వంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. ఎవరికి ఇస్తే ఎవరికి కోపమో అనే భయం! నియోజకవర్గాల్లో ముఠా రాజకీయాలు ఉన్నాయి. ఉన్నది ఒక్క పోస్టు, ఆశావహులు పదుల సంఖ్యలో ఉంటున్నారు. ఏ ఒక్కరి పేరు సిఫారసు చేసినా మిగిలిన వర్గాలు తమకు వ్యతిరేకంగా మారతాయనే భయంతో చాలామంది ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు జాబితాలను పంపకుండా వాయిదా వేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన చేరికల నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విపక్షంలో ఉన్నప్పుడు కేసులు ఎదుర్కొని పోరాడిన పాత కాంగ్రెస్ కేడర్ తీవ్ర అన్యాయానికి గురవుతోందనే భావన బలంగా నాటుకుపోతోంది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, స్థానిక సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఉమ్మడి జిల్లాల వారీగా ఇచ్చే పేర్లలో కూడా అధిష్ఠానం వద్ద తీవ్ర పోటీ నెలకొంటోంది. క్యాడర్ నిరాసక్తత – కాంగ్రెస్‌కు రాబోయే సవాళ్లు విపక్షాల్లో ఉన్నప్పుడు వీధిపోరాటాలు చేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు అధికారం దక్కిన మూడేళ్లకి కూడా గుర్తింపు లభించకపోవడం వల్ల గ్రామ, మండల స్థాయిలో కేడర్ పూర్తిగా సైలెంట్ అయిపోతోంది. పార్టీ సభ్యత్వ నమోదు, ప్రభుత్వ పథకాల ప్రచారం లేదా రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేయడంలో గతంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు కార్యకర్తల్లో కనిపించడం లేదు. ప్రభుత్వం సాధించిన విజయాల కంటే అంతర్గత పంచాయితీలే ఎక్కువగా వార్తల్లో నిలవడం పార్టీ ఇమేజ్‌ను కూడా మసకబారుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం , టీపీసీసీ నాయకత్వం ఇకనైనా రాజకీయ భయాలను పక్కనబెట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉందని

Original source: telugu.abplive.com
Read more on Kaizer News