Kaizer News

Rangareddy: బండరావిరాలలో ఘనంగా గురువుల సన్మాన కార్

Rangareddy: బండరావిరాలలో ఘనంగా గురువుల సన్మాన కార్యక్రమం!

· State - Telangana · hmtvlive.com

Shorts Rangareddy: బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో గురువుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను గుర్తిస్తూ పలువురు గురువులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యాభివృద్ధికి, ముఖ్యంగా పాఠశాల అభివృద్ధికి BRR ఫౌండేషన్ వ్యవస్థాపకులు బుడిద రామిరెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలను అభినందించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఫౌండేషన్ చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News