Kaizer News

KTR | బీరం హర్షవర్దన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర

KTR | బీరం హర్షవర్దన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌.. వీడియో

· State - Telangana · ntnews.com

KTR | కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి తండ్రి, సింగోటం లక్ష్మారెడ్డిగా సుపరిచితులైన బీరం లక్ష్మారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారని తెలిసిందే. ఈ మేరకు శనివారం కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. కేటీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో పితృవియోగంతో దుఃఖంలో ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నాయకులున్నారు. సింగోటం లక్ష్మారెడ్డి పలుమార్లు సింగిల్ విండో అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు, రైతాంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. లక్ష్మారెడ్డి మరణం బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి, వారి బంధుమిత్రులకు తీరని లోటని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ..ఈ విషాద సమయంలో బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో పితృవియోగంతో దుఃఖంలో ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి, కుటుంబ సభ్యులకు పరామర్శించి, బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన… pic.twitter.com/tDTLyc15g3 Plank Exercise | రోజుకు 60 సెక‌న్ల పాటు ప్లాంక్ చేస్తే బీపీ త‌గ్గుతుంది.. నిపుణుల వెల్ల‌డి.. RTC Elections | ఆర్టీసీలో ఎన్నికల నగారా.. 9న గుర్తింపు సంఘం ఎన్నికలు! iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్‌ 18ప్రో.. భారత్‌లో మొదలైన 18 సిరీస్‌ అమ్మకాలు..!

Original source: ntnews.com
Read more on Kaizer News