Kaizer News

Karimnagar: కరీంనగర్‌లో ట్రైసైకిళ్లు, ఫాగింగ్ మిషన

Karimnagar: కరీంనగర్‌లో ట్రైసైకిళ్లు, ఫాగింగ్ మిషన్ల పంపిణీ

· State - Telangana · hmtvlive.com

Shorts కరీంనగర్: మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడుతు కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం. రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులకు టెండర్లు మొదలు కాబోతున్నాయి. మరో రూ.80 యూసీఎఫ్ నిధులతో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పనులు చేపట్టబోతున్నాం. మరో 16 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్ మెంట్ పనులను ప్రారంభించబోతున్నం అని తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News