Kaizer News

మ్యాక్స్‌వెల్‌కు వార్నింగ్‌

మ్యాక్స్‌వెల్‌కు వార్నింగ్‌

· Sports · sakshi.com

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో లెవల్-1 కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు వార్నింగ్‌ వచ్చింది. ఈ టోర్నీలో బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మ్యాక్సీ.. డబ్లిన్ గార్డియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసభ్య పదజాలం వినియోగించాడు. ఫలితంగా నిర్వహకులు అతడిపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి మ్యాక్స్‌వెల్‌ తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా మందలింపుతో సరిపెట్టారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌తో చెలరేగి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. కేవలం 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. తద్వారా తొలుత బ్యాటింగ్‌ చేసిన అతడి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. బెల్‌ఫాస్ట్‌ జట్టులో మ్యాక్స్‌వెల్‌తో పాటు మార్క్‌ చాప్‌మన్‌ (54) కూడా రాణించాడు. డబ్లిన్‌ బౌలర్లలో క్రిస్‌ వుడ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. జోష్‌ లిటిల్‌ 2, హోలార్డ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు. అనంతరం 185 పరుగుల లక్ష్య ఛేదనలో డబ్లిన్‌ జట్టు చేతులెత్తేసింది. మార్క్‌ అదైర్‌ (2-26), ఫ్రెడ్‌ క్లాస్సెన్‌ (2-26), హంఫ్రేస్‌ (2-23), నేత్రావాల్కర్‌ (1-24), క్రిస్‌ జోర్డాన్‌ (1-30) ధాటికి 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. తద్వారా బెల్‌ఫాస్ట్‌ జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెరుపు అర్ద శతకంతో సత్తా చాటిన మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) Viral: రన్నింగ్ RTC బస్సు డ్రైవర్ కు గుండెపోటు రెండున్నర లక్షల శవాల సమాధి.. చైనా దాచిన జలప్రళయం

Original source: sakshi.com
Read more on Kaizer News