Kaizer News

మెదక్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి భవనాలు గుర్త

మెదక్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి భవనాలు గుర్తించాలి : కలెక్టర్ ప్రతిమాసింగ్

· State - Telangana · v6velugu.com

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ జిల్లాలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు అనువైన పాఠశాల భవనాలను గుర్తించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ​లో కేంద్రీయ విద్యాలయ డిప్యూటీ కమిషనర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఎ.ఎ. ఇజ్రాయల్, అడిషనల్​ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్యతో కలిసి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో నూతన కేంద్రీయ విద్యాలయం నెలకొల్పేందుకు హవేళీ ఘనపూర్ మండలంలో వైపీఆర్​ ఇంజినీరింగ్ కాలేజ్ పరిసర ప్రాంతాలక్లో ఆరు ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. అందులో భాగంగా తాత్కాలికంగా ప్రారంభించేందుకు అనువైన విద్యాలయ భవన సముదాయాలను గుర్తించాలని సూచించారు. అంతకుముందు మెదక్ పట్టణంలో పలు భవనాలను ఆమె పరిశీలించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News