తెలంగాణ: ట్రాక్టర్ ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది. దీంతో 25 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన కూలీలు తిమ్మారెడ్డిపల్లి శివారులోని కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. కుకునూరుపల్లిలో కూరగాయల మార్కెట్‌కు ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ట్రాలీని వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ పలీ్టకొట్టింది. కూలీలు ఎగిరి రోడ్డుపై పడిపోయారు. ట్రాలీలో ఉన్న 25 మందిలో ఆరుగురికి తీవ్ర, 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులోని 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్, డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలంటూ సూచించారు. ఇదీ చదవండి: తండ్రి మందలించాడని.. విద్యార్థి ఆత్మహత్య ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) హైదరాబాద్ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే