School Midday Meal: తమిళనాడు ప్రభుత్వం సర్కార్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఓ తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం బడుల్లో పిల్లలకు చికెన్ బిర్యానీ వడ్డించే ప్రతిపాదనపై మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇది ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అని సదరు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ వెల్లడించారు. అయితే ఈ పథకాన్ని వెంటనే అమలు చేయడం కుదరదని, పరిశుభ్రత, ఆహార భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని మంత్రి చెప్పారు. ముందుగా కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి, నాణ్యతా ప్రమాణాలను పరీక్షించిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని స్పష్టం చేశారు