Kaizer News

మహారాష్ట్రలో ఈ టిఫిన్‌ కోసం జనం ఎందుకు క్యూ కడతారు

మహారాష్ట్రలో ఈ టిఫిన్‌ కోసం జనం ఎందుకు క్యూ కడతారు?

· State - Telangana · sakshi.com

‘మి సల్‌’ అంటే మరాఠీ భాషలో ‘కలయిక‘ అని అర్థం. 20వ శతాబ్దం ప్రారంభంలో మహారాష్ట్రలోని ఖాందేశ్, నాసిక్‌ ప్రాంతాల్లోని రైతులు, రోజువారీ కూలీల కోసం ఈ వంటకం పుట్టుకొచ్చింది. తక్కువ ఖర్చుతో, ఎక్కువ శక్తినిచ్చే ఆహారం కావడంతో... ఇళ్లలో మిగిలిపోయిన ఉడకబెట్టిన పెసళ్లు, శనగలు, మసాలా రసం, చుట్టూ దొరికే కరకరలాడే స్నాక్స్‌ను కలిపి ఒక డిష్‌గా అందించడం ప్రారంభించారు. అలా మిసల్‌ పావ్‌ వంటకం ప్రజలందరికీ ఇష్టమైన వంటకంగా మారిపోయింది. మహారాష్ట్ర వీధుల్లో ఎక్కడ చూసినా కనిపించే ‘మిసల్‌ పావ్‌’ కేవలం ఒక టిఫిన్‌ మాత్రమే కాదు... పుణె సంస్కృతిలో భాగమైన ఒక ఎమోషన్‌. ఘాటైన కారం, కరకరలాడే ఫర్సాన్, ఉడకబెట్టిన మొలకెత్తిన ధాన్యాలు, వేడివేడి పావ్‌ల కాంబినేషన్‌ ప్రతి ఒక్కరి నాలుకపై నీరూరిస్తుంది. ఒకప్పుడు పేద ప్రజలు, కూలీల ఆకలి తీర్చడానికి మొదలైన ఈ మిసల్‌ పావ్‌... నేడు పుణె సిటీలోనే అత్యంత ఐకానిక్‌ డిష్‌గా మారిపోయింది. తక్కువ ధరలో లభించే పోషకాహారం కావడంతో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, పర్యాటకులు మిసల్‌ పావ్‌ రుచికి దాసోహమయ్యారు. నేడు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన శాకాహార అల్పాహారాల్లో ఒకటిగా లండన్‌లో గుర్తింపు పొందే స్థాయికి మిసల్‌ పావ్‌ ఎదిగింది. షాపుల ముందు మైళ్ల పొడవునా క్యూ నిలబడినా సరే... పొగలు కక్కే మిసల్‌ పావ్‌ తింటే వచ్చే ఆ తృప్తి ముందు ఆ నిరీక్షణ చిన్నబోతుందంటారు పుణె వాసులు. ఇవీ చదవండి: ఆఫీస్‌ వర్క్‌లో ఫోకస్‌ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్‌ తప్పనిసరి! మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) మా ఆయనను చంపింది కటౌట్ శ్రీను! సతీష్ రెడ్డి భార్య, వదిన సంచలన కామెంట్స్ టాక్సిక్ నిరాశలో రుక్మిణి.. ఇక ఆశలన్నీ డ్రాగన్ పైనే టార్చ్ లైట్లు వేసుకొని చికిత్సలా.. కొంచమైనా బుర్ర ఉందా..!?

Original source: sakshi.com
Read more on Kaizer News