మూడు ఫిర్యాదులపై చర్యలు.. పెన్షన్‌లో కోత, జీత భత్యాల నిలుపుదల.. అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు ఏపీ లోకయుక్త రిజిస్టర్ తల్లప్రగడ మల్లికార్జున రావు కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, పంచాయతీ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ,అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన మూడు ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చర్యలకు ఆదేశించింది. సంబంధిత ప్రభుత్వ శాఖలు ఇప్పటికే చేపట్టిన క్రమశిక్షణ చర్యలు, జరిమానాలు, రికవరీ ప్రక్రియ, అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దును పరిగణనలోకి తీసుకుని ఫిర్యాదులను పరిష్కరించింది. ఫిర్యాదు నంబర్ 1793,2013,B1లో అప్పటి జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆదినారాయణరెడ్డి చేసిన ఫిర్యాదులో.. కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 24.02 ఎకరాల భూమికి సంబంధించి చెక్కపెద్ద ఓబులరాజు, ఆయన కుటుంబ సభ్యులకు రూ.21,92,721 ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లు ఆరోపించారు. నకిలీ డీ-పట్టాలు, పట్టాదారు పాస్‌బుక్కులు, టైటిల్ డీడ్ల ఆధారంగా ఈ చెల్లింపులు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణలో ఫోర్జరీ సంతకాలతో పత్రాలు రూపొందించినట్లు వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ నివేదించారు. సంబంధిత రెవెన్యూ అధికారులు సరైన ధ్రువీకరణ లేకుండానే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని సిఫారసు చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో అప్పటి ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లపై ఆరోపణలు రుజువయ్యాయి. అనంతరం రెవెన్యూ (విజిలెన్స్–I) శాఖ 02.01.2023న ఇద్దరు రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల నెలవారీ పెన్షన్‌లో మూడేళ్లపాటు 10 శాతం కోత విధించింది. అక్రమ లబ్ధిదారులపై జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండగా, రూ.27,78,391 రికవరీకి చర్యలు కొనసాగుతున్నట్లు లోకాయుక్తకు నివేదించారు. సంబంధిత అధికారులపై తదుపరి క్రిమినల్, రికవరీ చర్యలను చట్టప్రకారం కొనసాగించాలని సూచిస్తూ ఫిర్యాదును లోకాయుక్త ముగించింది. ఫిర్యాదు నంబర్ 1084/2020/B1లో ఎంఆర్‌పీఎస్ జనరల్ సెక్రటరీ కె. రమేష్ చేసిన ఫిర్యాదులో ఏలూరు రూరల్ మండలం శనివారపుపేట గ్రామ పంచాయతీ అప్పటి పంచాయతీ కార్యదర్శి–గ్రేడ్–1 స్వచ్ఛ ఆంధ్ర నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సంబంధిత అధికారిపై ఒక వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్‌ను క్యుములేటివ్ ఎఫెక్ట్‌తో నిలుపుదల చేస్తూ శిక్ష విధించారు. ఇప్పటికే శాఖాపరమైన విచారణ పూర్తయి తుది ఉత్తర్వులు వెలువడినందున తదుపరి విచారణ అవసరం లేదని లోకాయుక్త పేర్కొంటూ ఫిర్యాదును మూసివేసింది. ఫిర్యాదు నంబర్ 528/2023/B1లో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చంద్రగిరి లంబోదర.. కృష్ణాపురం రెవెన్యూ గ్రామంలో ని సర్వే నంబర్ 22/3లోని భూమికిసంబంధించి, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏ కింద రిజిస్ట్రేషన్‌కు నిషేధితమైన భూమిపై అప్పటి కడప రూరల్ సబ్-రిజిస్ట్రార్ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు అనుమతించారని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై అప్పటి జాయింట్ సబ్-రిజిస్ట్రార్, కడప రూరల్ (ప్రస్తుత