Kaizer News

యూపీలో బీజేపీకి పెరుగుతున్న సవాళ్లు.. 2027లో ఏమవుత

యూపీలో బీజేపీకి పెరుగుతున్న సవాళ్లు.. 2027లో ఏమవుతుంది?

· State - Telangana · prabhanews.com

రామమందిర చందాల వివాదం.. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫా నిరసనలు.. ధరల పెరుగుదలతో మారుతున్న రాజకీయ వాతావరణం ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాబోయే ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గతంలో మాదిరిగా విజయం అంత సులభంగా ఉండకపోవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇండియా టుడే–మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వేల్లో బీజేపీ గ్రాఫ్‌ పడిపోతున్నట్లు వెల్లడైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రామమందిర చందాల వ్యవహారం కమలదళాన్ని వెంటాడుతున్న అంశాల్లో ఒకటిగా మారింది. సీ ఓటర్‌ సర్వేలో ఎన్డీఏకు అనుకూలంగా ఉన్న ఓటర్లలో 50 శాతానికి పైగా మంది రామమందిర చందాల విషయంలో తమ విశ్వాసానికి భంగం కలిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నాయి. దీంతో రామమందిర అంశంతో పాటు ఆ చందాల వ్యవహారం కూడా 2027 ఎన్నికల నాటికి రాజకీయంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న జెన్‌ జీ ఉద్యమం, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం వంటి పరిణామాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో జెన్‌ ఆల్ఫా ఉద్యమం కూడా కొనసాగింది. పాఠశాల విద్యార్థులు సైతం లక్నో, మీరట్‌ ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహించారు. విద్యా రంగంలోని సమస్యలపై విద్యార్థులు పోరాటాలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో పేపర్‌ లీకేజీ సమస్య కూడా యువతలో ఆగ్రహానికి కారణమైంది. 2024లో రాష్ట్రంలో నిర్వహించనున్న 60 వేలకుపైగా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ఏకంగా 48 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడిన ఆ నియామక ప్రక్రియలో పరీక్షకు సంబంధించిన పరిణామాల కారణంగా నియామక పరీక్ష నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక యువతలో అసంతృప్తి పెరిగిందనే చర్చ మొదలైంది. ఈ ప్రభావమే జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఉద్యమంలోనూ కనిపించిందని, యూపీ నుంచి భారీ సంఖ్యలో నిరుద్యోగులు అక్కడ జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. రాజస్థాన్ లో గ్రాఫ్ డౌన్.. యూపీకి వెలుపల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను కూడా బీజేపీకి ఎదురవుతున్న సవాళ్లతో ముడిపెట్టి చూస్తున్నారు. బిహార్‌లోని బాంకీపూర్‌ బీజేపీకి కంచుకోట.. అక్కడ సీటును బీజేపీ కోల్పోవడం ఆ పార్టీకి రాజకీయంగా చర్చనీయాంశమైంది. అలాగే రాజస్థాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ తన గ్రాఫ్‌ను కోల్పోయింది. అక్కడ కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఓట్ల వ్యత్యాసం ఒక శాతానికి లోపే నమోదైనట్లు సమాచారం. ఈ పరిణామాలను కూడా దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ స్థితిగతుల్లో మార్పులకు సంకేతాలుగా కొందరు విశ్లేషిస్తున్నారు. ధరల పెరుగుదల ధరల పెరుగుదల కూడా యూపీ ఎన్నికల్లో మరో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. దేశంలో చక్కెర ధరలు భారీగా పెరగడంతో పాటు బియ్యం ధరలు కూడా తారస్థాయికి చేరుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యావసరాల ధరల పెరుగుదల నేరుగా సామా

Original source: prabhanews.com
Read more on Kaizer News