Kaizer News

Renigunta: మాతృభాష విశిష్టతను తెలిపిన రైన్బో స్కూల

Renigunta: మాతృభాష విశిష్టతను తెలిపిన రైన్బో స్కూల్ విద్యార్థులు!

· State - Telangana · hmtvlive.com

Renigunta: రైన్బో స్కూల్‌లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. మాతృభాష తెలుగు గొప్పతనం, మాధుర్యం, విలువతో పాటు తెలుగు భాషకు మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాషపై అవగాహన కల్పించేలా స్కిట్స్, పాటలు, పద్యాలు, రైమ్స్, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. తమ మాటలు, పాటలు, ప్రదర్శనల ద్వారా తెలుగు భాషను ప్రేమించడం, గౌరవించడం, పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని చక్కగా తెలియజేశారు. చిన్నారుల ప్రతిభ, ఉత్సాహభరితమైన ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. మాతృభాషపై విద్యార్థుల్లో మరింత గౌరవం, అభిమానం పెంపొందించేలా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిన రైన్బో స్కూల్ చైర్మన్ అత్తావుల్లా ఖాన్, ప్రిన్సిపాల్ షహేర్ బానులకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.“తెలుగు మన భాష మాత్రమే కాదు.. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన గుర్తింపు. తెలుగును మాట్లాడుదాం.. ప్రేమిద్దాం.. భావితరాలకు అందిద్దాం” అనే సందేశంతో వేడుకలు ముగిశాయి

Original source: hmtvlive.com
Read more on Kaizer News