Kaizer News

ఎక్కడ విన్న ఒక్కటే మోత: సోషల్ మీడియాను ఊపేస్తోన్న

ఎక్కడ విన్న ఒక్కటే మోత: సోషల్ మీడియాను ఊపేస్తోన్న నాని యేష నాగుల కట్ట మీద సాంగ్

· Entertainment · v6velugu.com

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే విడుదలైన ఆయా షేర్ సాంగ్‌‌, టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్‌‌ రావడంతోపాటు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా రెండో పాటను విడుదల చేశారు. ‘యెష నాగుల’ అంటూ సాగే జానపద పాటను అనిరుధ్ రవిచందర్ తనదైన హై-ఎనర్జీతో కంపోజ్ చేశాడు. ఈ పాటను డల్లాస్‌‌లో లైవ్ కాన్సర్ట్‌‌ ద్వారా రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించగా, జంగి రెడ్డి మరింత ఎనర్జిటిక్‌‌గా పాడాడు. ఆట సందీప్ కొరియోగ్రఫీలో కలర్‌‌‌‌ఫుల్‌‌గా సాగిందీ పాట. ‘జిమ్మెదారి పటేలో జిమ్మెదారి పటేలా... గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో.. జిమ్మెదారి పటేలో జిమ్మెదారి పటేలా.. నీతోవల నా సూపులు కావలున్నయో.. అర్రల గుడ్డిదీపమయ్యిందిర పాణం.. ఒర్రిన ఇంట్ల లేదు ఏందీ పాపం.. బుడ్డపరకల కూర ఒండిన నీకోసం.. బుడమట్లబువ్వతోని తిని పా కొంచెం.. ఓ బుజ్జవ్వా మరి సద్దికట్టుకొని రారాదు.. ఎక్కడికో.. యేష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల..’ అంటూ తెలంగాణ జానపద సాహిత్యంతో సాగిన పాటలో నాని చాలా ఎనర్జిటిక్‌‌గా కనిపించాడు. తనతోపాటు కీర్తి సురేష్ చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 24న తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ సహా ఎనిమిది భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

Original source: v6velugu.com
Read more on Kaizer News