Kaizer News

Suryapet: సూర్యాపేట వద్ద కారు దగ్ధం, ఒకరు మృతి!

Suryapet: సూర్యాపేట వద్ద కారు దగ్ధం, ఒకరు మృతి!

· State - Telangana · hmtvlive.com

Shorts Suryapet: సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఖమ్మం - హైదరాబాద్ 365బీ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్ ఎస్ఐ ఎం. అనిల్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. దగ్ధమైన వాహనం వోల్వో కారుగా పోలీసులు గుర్తించారు. కారులో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడా లేక మరెవరైనా ఉన్నారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దగ్ధమైన వాహనంలో మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం ఉదయం 7.15 గంటల సమయంలో జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కారు నంబర్ ప్లేట్ పూర్తిగా దగ్ధం కావడంతో వాహనం, మృతుడి వివరాలు గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో ఖమ్మం వైపు ఉన్న టోల్ ప్లాజాల వద్ద సీసీ కెమెరాలు, వాహనాల రికార్డుల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి

Original source: hmtvlive.com
Read more on Kaizer News