30 మంది విద్యార్థినులకు అస్వస్థత.. Narayanpet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతున్న బాలికలు భోజనం తర్వాత కడుపునొప్పితో బాధపడటాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో నొప్పి తీవ్రంగా ఉన్న 15 మంది విద్యార్థినులను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది