సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు ఆశించినంత స్పందన రాని టీనేజర్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతినడమే కాకుండా నిద్రలేమి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని దేశంలో తాజాగా జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది. ‘ద జర్నల్ ఆఫ్ థియరిటికల్ అకౌంటింగ్ రీసెర్చ్’లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో భాగంగా టీనేజర్లు తమ పోస్టుకు వస్తాయని ఆశించిన లైక్స్ సంఖ్యకు, నిజంగా వచ్చిన లైక్స్ సంఖ్యకూ మధ్య ఉన్న తేడాను పరిశోధకులు పరిశీలించారు. ఈ సమయంలో టీనేజర్లను 30 రోజులపాటు స్మార్ట్ వాచ్‌ల ద్వారా పర్యవేక్షించారు. వారి నిద్రలోని దశలు, గుండె కొట్టుకొనే తీరులో మార్పులు, శ్వాస తీసుకొనే రేటు, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, నిద్ర నాణ్యత స్కోర్ తదితర అంశాలను నమోదు చేశారు. సోషల్ మీడియా కలిగించే భావోద్వేగ ఆందోళనలు టీనేజర్లలో నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాయని ఈ సర్వేలో తేలింది. ఒక పోస్టుకు ఆశించిన దానికన్నా తక్కువ లైక్స్ వస్తే ఇతరులతో పోల్చుకొని ఆందోళన చెందుతుండటం ఈ పరిస్థితికి దారితీస్తోందని వెల్లడైంది. 18–25 ఏళ్ల మధ్య యువతలో 64.7 శాతం మందికి నాణ్యమైన నిద్ర లేదని ఉండట్లేదని మరో అధ్యయనం వెల్లడించింది. 22.5 శాతం మంది రాత్రంతా నిద్రపోకుండా సోషల్ మీడియాలోనే ఉంటున్నారని.. 7.8 శాతం మంది తమకు తక్కువ లైక్స్ లేదా కామెంట్లు రావడం వల్ల బాధపడుతున్నారని అంచనా వేసింది. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!