Kaizer News

Jurala Project | జూరాల వద్ద ఉద్రిక్తత.. స్వయంగా ప్

Jurala Project | జూరాల వద్ద ఉద్రిక్తత.. స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు..!

· State - Telangana · ntnews.com

Jurala Project : జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి విడుదల కోసం పొద్దటి నుంచి ధర్నా చేసినా అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు రెగ్యులేటర్‌ పైకి ఎక్కారు. మూకుమ్మడిగా రెగ్యులేటర్ పైకి చేరుకున్న రైతన్నలు స్వయంగా పొలాలకు సాగునీరు వదులుకున్నారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ శనివారం ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేశారు. అయినా సరే అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రైతన్నలకు కోపమొచ్చింది. పంటల ఎండుతున్నా కనికరం లేని కాంగ్రెస్ సర్కార్‌ను తిట్టుకుంటూ.. మూకుమ్మడిగా జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కిన రైతులు స్వయంగా నీటిని విడుదల చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు రెగ్యులేటర్‌ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం జూరాల… https://t.co/zqpqtzttCr pic.twitter.com/jc1jkuxFxF

Original source: ntnews.com
Read more on Kaizer News