Kaizer News

Amalapuram: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి

Amalapuram: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: డీఆర్వో

· State - Telangana · hmtvlive.com

Shorts Amalapuram: జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి వి సుబ్బారావు ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలపై మరియు స్వచ్ఛ సర్వేక్షన్ స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ ను కలెక్టరేట్ సిబ్బందితో చేయించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ అక్టోబర్ 2న నిర్వహించనున్న స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాలలో భాగంగా ప్రతి మూడో శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలలో ఏర్పడిన చెత్తను సేకరణ చేసి పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని,దానికి మనమందరం కట్టుబడి ఉండాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలన అధికారి కే నాగలక్ష్మమ్మ,కేసీఎం మేనేజర్ రమేష్,కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News