Kaizer News

Rayachoti: మాసాపేట గణేష్ విగ్రహాన్ని దర్శించుకున్న

Rayachoti: మాసాపేట గణేష్ విగ్రహాన్ని దర్శించుకున్న నిశ్చల్ నాగిరెడ్డి

· State - Telangana · hmtvlive.com

Shorts రాయచోటి: రాయచోటి పట్టణం మాసాపేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గారు ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిశ్చల్ నాగిరెడ్డి గారికి మాసాపేట యువత ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాసాపేట యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయక చవితి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News