Kaizer News

Vinukonda: వినుకొండలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయ

Vinukonda: వినుకొండలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం!

· State - Telangana · hmtvlive.com

Shorts Vinukonda: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు.వినుకొండ నియోజకవర్గం ఈపూరు గ్రామంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ఐక్యత, స్థానిక ఎన్నికలకు సన్నద్ధతతో పాటు ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం తమ హయాంలో చేసిన పనులే పార్టీకి నిజమైన బలమన్నారు. ప్రజలకు చేసిన మేలును ప్రజలు గుర్తుంచుకుంటారని, ఆ నమ్మకంతో ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రజలకు చేసిన మేలే తమ బలమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండాలని అన్నారు.కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్న ఆయన.. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున పోరాడాలని సూచించారు. వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా పార్టీ ప్రయోజనాల కోసం ఐక్యంగా పనిచేయాలని కోరారు. కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోనని, కష్టకాలంలో తన వెంట నడుస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని బొల్లా బ్రహ్మనాయుడు భరోసా ఇచ్చారు. అనంతరం వివిధ హోదాల్లో నియమితులైన నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News