Kaizer News

Kids care: నిద్రలో పిల్లలకు చెమటలు పడుతున్నయా.. ఎట

Kids care: నిద్రలో పిల్లలకు చెమటలు పడుతున్నయా.. ఎట్టి పరిస్థితిలో అశ్రద్ద చేయొద్దు.. తీసుకోవాలసిన జాగ్రత్తలు ఇవే..!

· State - Telangana · v6velugu.com

నిద్రలో చెమట పట్టే పసిపిల్లలుఇంట్లో ఉంటే.. ఆ ఇంటి టైమ్ టేబుల్ పూర్తిగా మారిపోతుంది. పసివాళ్లు నిద్రపోయే టైంకి.. పెద్దవాళ్లు నిద్రపోయే టైంకి చాలా తేడా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ టైమ్ టేబుల్ వల్ల మంచే జరుగుతుంది. అంటే పిల్లలు నిద్రపోయేటప్పుడు పెద్దలు మేల్కొనే ఉంటారు కాబట్టి, వాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టొచ్చు. కొందరు పిల్లలకు నిద్రలో ఒళ్లంతా చెమటలు పడతాయి. అలాంటప్పుడు మాత్రం అమ్మానాన్నలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొందరు పిల్లలు విపరీతమైన చెమటలతో అర్థరాత్రి నిద్రలోంచి మేలుకుంటారు. దాన్నే 'నైట్ స్వెట్స్' అంటారు. కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఆ టైమ్​ లో అమ్మానాన్నలు పడే టెన్షన్ అంతాఇంతా కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోందో? ఏం చేయాలో తోచక బాధపడుతుంటారు. అందువల్ల రాత్రుళ్లు చెమట పట్టడం వంటి విషయాలపై అవగాహన ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. పుట్టుకతో గుండె జబ్బుల బారిన పడిన చిన్నారుల్లో చెమట ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట వీళ్లకు బాగా చెమట పడుతుంది. అలాగే అడుకునే టైమ్​ లో తినేటప్పుడు చెమట పడుతుంది. అయితే నూట ఇరవై మందిలో ఒకరికి ఇటువంటి సమస్య ఎదురవుతుందని స్టడీస్ చెప్పన్నాయి. తల్లి గర్భంలో ఉన్న సమయంలో గుండె ఎదుగుదల సవ్యంగా లేనప్పుడు ఇలా జరుగుతుంది. స్లీప్ అప్నియా అనే ఒకరకమైన స్థితి వల్ల కూడా చిన్నారులకు నిద్రలో విపరీతమైన చెమటలు పడతాయి. ఇలాంటి పరిస్థితిలో పిల్లలు కనీసం ఇరవై సెకండ్ల పాటు శ్వాస తీసుకోలేకపోతారు. అందువల్ల ఆ చిన్నారి శరీరం శ్వాస తీసుకోవడం కోసం విపరీతంగా కష్టపడుతుంది. స్లీప్ ఆప్నియా అనే ఈ సమస్య ప్రీమెచ్యూర్ బేబీస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ స్లీప్ అప్నియా సమస్యతో సతమతమవుతున్న పిల్లల శరీరం నీలంగా మారినా, అలాగే గురక సమస్య వచ్చినా వెంటనే డాక్టర్​ ను సంప్రదించాలి. రాత్రిపూట పిల్లల శరీరంలో వేడి ఎక్కువైపోతే వల్ల సడెన్ ఇన్​ ఫాంట్ డెత్ సిండ్రోమ్ కండిషన్ ఏర్పడుతుంది. దీనివల్ల చిన్నారి గాఢ నిద్రలోకి జారుకుంటుంది. తర్వాత మేల్కోవడం చిన్నారికి కష్టంగా మారుతుంది. చల్లని వాతావరణంలో ఉన్నా కొందరి పిల్లలకు విపరీతమైన చెమటలు పడతాయి. ఈ కండిషన్​ ను 'హైపర్ హైడ్రోసిస్' అంటారు. చెమటతో తడిచిన తల, చేతులు, పాదాలు, వంటివి ఈ సమస్యను గుర్తించేందుకు కనిపించే లక్షణాలు. ఇది భయపడాల్సిన పెద్ద ఆరోగ్య సమస్య కాదు. కొన్నిసులభమైన చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. పసిపిల్లలు డీహైడ్రేషన్ సమస్య బారినపడకుండా ఉండేందుకు తగినన్ని ఫ్లూయిడ్స్ ను ఎప్పటికప్పుడు తాగిస్తూ ఉండాలి. అలాగే చిన్నారి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా శరీరంలో తగినన్ని ద్రవాలు లేకపోవడంవల్ల చేతులకు చెమటలు పడతాయి. తల్లిపాలు తాగే పిల్లలకు తగినన్ని పాలు పట్టిస్తూ ఉండాలి. అలా అధిక చెమట సమస్య నుంచి పిల్లలను కాపాడొచ్చు. రాత్రిపూట పిల్లలకు సౌకర్యవంతమైన బట్టలనే తొడగాలి. బ్రీతబుల్ మెటీరియల్ తో తయారైన సాఫ్ట్ డ్రెస్సులను వేస్తే హాయిగా ఆడుకుంటారు. అలాకాకుండా సీజన్​ తో సంబంధం లేకుండా స్వెటర్స్ వేయొద్దు. చాలావరకు కేసుల్లో పిల్లలకు టైట్ డ్రెస్సుల వల్లే శ్వాస సమస్యలు వస్తున్నట్లు స్టడీస్

Original source: v6velugu.com
Read more on Kaizer News