Kaizer News

సమస్యల పరిష్కారానికే ‘ఇంటింటికి నాయకర్’

సమస్యల పరిష్కారానికే ‘ఇంటింటికి నాయకర్’

· State - Telangana · prabhanews.com

ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఎమ్మెల్యే నర్సాపురం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారమే ‘ఇంటింటికి నాయకర్’ కార్యక్రమం లక్ష్యమని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన నర్సాపురం పట్టణంలోని 12వ వార్డులో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటింటా ఎమ్మెల్యేకు స్వాగతం పలికి తమ సమస్యలను విన్నవించారు. ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్లి ప్రజల సాధకబాధకాలను స్వయంగా తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయరాదని, పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News