Kaizer News

Parchur: ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన కొమ్మా

Parchur: ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన కొమ్మాలపాటి రవికి అభినందనలు

· State - Telangana · hmtvlive.com

పర్చూరు: పర్చూరు ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి రవి, నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, సమాజ హితం కోసం పాత్రికేయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పర్చూరు ప్రాంత సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల అవసరాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రెస్‌క్లబ్‌ మరింత చురుగ్గా పనిచేయాలని ఆకాంక్షించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొమ్మాలపాటి రవి పాత్రికేయుల సంక్షేమానికి, వృత్తి విలువల పరిరక్షణకు కృషి చేయాలని ఏలూరి సాంబశివరావు సూచించారు. ఈ సందర్భంగా రవికి శుభాకాంక్షలు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News