Kaizer News

4 కాదు.. 6 చక్రాలు.. వేలానికి వచ్చిన విచిత్ర వాహనం

4 కాదు.. 6 చక్రాలు.. వేలానికి వచ్చిన విచిత్ర వాహనం!

· National - India · telugu.oneindia.com

సాధారణంగా కార్లకు 4 చక్రాలు మాత్రమే ఉంటాయి. హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీ వరకు ఏదైనా నాలుగు చక్రాలతోనే రోడ్లపై పరుగులు తీస్తుంది. అయితే అమెరికాలో ఓ వాహన ప్రియుడు తన కారుకు మరో రెండు చక్రాలు అదనంగా అమర్చి వార్తల్లో నిలిచాడు. ప్రపంచంలోనే ఏకైక 6-చక్రాల ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారుగా గుర్తింపు పొందిన ఈ వినూత్న వాహనం ప్రస్తుతం అమెరికన్ ఆన్‌లైన్ వేలం వెబ్‌సైట్ 'బ్రింగ్ ఏ ట్రైలర్'లో వేలానికి అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్ కార్లకు ఇక నో ఎంట్రీ? టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవుతారు! మోడిఫైడ్ 6-చక్రాల ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్(2019 మోడల్)ను సదరు యజమాని తన అభిరుచికి తగ్గట్లుగా పూర్తిగా మార్చివేశాడు. క్యాబిన్ స్థలాన్ని, లెగ్‌స్పేస్‌ ను పెంచాలనే ఉద్దేశంతో కారు వెనుక భాగాన్ని పొడిగించి మరో అదనపు యాక్సిల్‌ను జోడించాడు. దీని వల్ల కారుకు రెండు అదనపు చక్రాలు చేరి మొత్తం ఆరు చక్రాల వాహనంగా రూపాంతరం చెందింది. డిజైన్, బాహ్య మార్పులు కారు బాడీ ఫ్రేమ్‌ను పొడిగించేందుకు అదనపు స్టీల్ ప్యానెల్స్, సబ్-ఫ్రేమ్‌లను ఉపయోగించారు. వెనుక యాక్సిల్‌పై ఒరిజినల్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌నే అమర్చారు. కారు లోపల లగేజ్ కోసం ప్రీమియం గ్రే కార్పెట్‌తో కూడిన విస్తృతమైన బూట్ స్పేస్ లభిస్తుంది. ఇక బాహ్య రూపం విషయానికొస్తే.. నలుపు రంగు పెయింట్, వైట్ పిన్‌స్ట్రైపింగ్, రూఫ్ స్పాయిలర్, పవర్డ్ మూన్‌రూఫ్, రూఫ్ ర్యాక్ లతో ఈ కారు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. భారత్‌లోకి కొత్త లగ్జరీ కార్ బ్రాండ్.. ఈ కార్లు వస్తే రచ్చే! ఇంటీరియర్, క్యాబిన్ విశేషాలు కారు ఇంటీరియర్ పరంగా కంపెనీ అందించిన స్టాక్ మోడల్ ఫీచర్లను అలాగే కొనసాగించారు. బ్లాక్ లెదర్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసే 6.5 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, హీటెడ్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక వసతులు ఇందులో ఉన్నాయి. ఇంజిన్ సామర్థ్యం ఈ ప్రత్యేక కారులో 2.0-లీటర్ డ్యూరాటెక్ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఇది 166 bhp శక్తిని, 202 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనకి 6-స్పీడ్ సెలెక్ట్ షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానించబడింది. అయితే ఇంజిన్ అందించే పవర్ కేవలం ముందు, మధ్య చక్రాలకు మాత్రమే బదిలీ అవుతుంది. వెనుక వైపు అమర్చిన మూడో యాక్సిల్, అదనపు రెండు చక్రాలు కేవలం కారు బరువును, పొడిగించిన ఫ్రేమ్ ను సమతుల్యం చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News