Kaizer News

GO | 2 రూపాయలు విడుదల చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ జీ

GO | 2 రూపాయలు విడుదల చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ జీవో.. కారణమేంటో తెలుసా..?

· State - Telangana · ntnews.com

GO | ప్రభుత్వం నుంచి ఏవైనా అభివృద్ధి పనుల విషయంలో కానీ, ఇతర నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో కానీ వాటికి సంబధించి జీవోలు జారీ చేయడం సాధారణంగా జరుగుతుంటుందని తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కూడా ఓ జీవో జారీ చేసింది. అది కూడా 2 రూపాయలు విడుదల చేయాలని జీవో జారీ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యవేక్షిస్తున్న పంచాయితీ రాజ్ శాఖ నుంచి 2 రూపాయలు విడుదల చేయాలని జీఓ జారీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఈ 2 రెండు రూపాయలకు సంబంధించిన జీవో విడుదల చేశారు. అదేంటి ఇంతకీ కేవలం 2 రూపాయలకే జీవో జారీ చేయడమేంటని అనుకుంటున్నారా..? పనులకు సంబంధించిన ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారానికి నిపుణుల సూచన మేరకు ఈ రెండు రూపాయల జీవో జారీ చేశామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఏదేమైనా ఇలాంటి జీవో విడుదల కావడం చాలా అరుదైన విషయమనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు రూపాయలు విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖ నుండి జీఓ గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం రెండు రూపాయలతో జీవో విడుదల పనులకు సంబంధించిన ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారానికి నిపుణుల సూచన మేరకు ఈ రెండు రూపాయల జీవో జారీ చేశామని వివరణ… pic.twitter.com/GioviwTAtG Plank Exercise | రోజుకు 60 సెక‌న్ల పాటు ప్లాంక్ చేస్తే బీపీ త‌గ్గుతుంది.. నిపుణుల వెల్ల‌డి.. RTC Elections | ఆర్టీసీలో ఎన్నికల నగారా.. 9న గుర్తింపు సంఘం ఎన్నికలు! iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్‌ 18ప్రో.. భారత్‌లో మొదలైన 18 సిరీస్‌ అమ్మకాలు..!

Original source: ntnews.com
Read more on Kaizer News