పెయింటింగ్ పనుల్లో జాగ్రత్తలు పాటించాలి : ఎస్సై తేజస్విని నడిగూడెం, ఆంధ్రప్రభ : ఇటీవల నూతనంగా ఎన్నికైన నడిగూడెం మండల హౌస్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) కార్యవర్గ సభ్యులు ఆదివారం మండల ఎస్సై తేజస్వినిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై తేజస్విని మాట్లాడుతూ.. ఇళ్లకు పెయింటింగ్ వేసే సమయంలో కార్మికులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు గంటెపంగు సైదులు, ఉపాధ్యక్షుడు నోసిన రవి, ప్రధాన కార్యదర్శి సీమ సుధాకర్, కోశాధికారి చిలక భాస్కర్, సహాయ కార్యదర్శులు కొండూరు యాదాద్రి, దాసరి నాగేష్, అట్లాగే తమ్మి, కార్యవర్గ సభ్యులు దాసరి నరేష్, సీమ యాకోబు, ఎస్కే పాషా, స్వామి, గంటెపంగు రమేష్, నాగేశ్వరరావు, చాందు, అశోక్, నూసిన రఘు తదితరులు పాల్గొన్నారు