Kaizer News

Draksharama: ద్రాక్షారామ ఆంజనేయ ఆలయంలో కూటమి నేతల

Draksharama: ద్రాక్షారామ ఆంజనేయ ఆలయంలో కూటమి నేతల సంప్రోక్షణ!

· State - Telangana · hmtvlive.com

Shorts Draksharama: ద్రాక్షారామ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం అపవిత్రమైందంటూ ఆలయాన్ని నీళ్ళతో శుభ్రంగా కడిగి పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేసిన కూటమి నాయకులు. ఆలయం వద్ద ముగ్గులు వేసి ఆంజనేయస్వామి వారికి అర్చనలు చేయించిన కూటమి నాయకులు. వైసిపి నాయకులు ఆలయ ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టి ఆలయాన్ని అపవిత్ర పరిచా రంటూ కూటమి నాయకులు సంప్రోక్షణ చేయడం పెద్ద దుమారం లేపింది. ఇటీవల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్,నియోజక వైసిపి ఇంచార్జ్ పిల్లి సూర్యప్రకాష్ లు ఆలయ కమిటీ సభ్యులు వైసీపీ నాయకులతో ఆలయాన్ని సందర్శించారు. ఆలయం బయట నిర్వహించిన మీడియా సమావేశం లో ఎంపీ బోస్ మాట్లాడుతూ ఆంజనేయస్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు స్వాదీనం చేసుకున్న తీరును తప్పు పట్టారు. ఆలయాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలను, మనోభావాలను పరిగణంలోకి తీసుకోవాలని, అదే సమయంలో ఆలయ కమిటీకి ముందస్తుగా నోటీసులు జారీ చేసి చట్టం ప్రకారం చేయాలన్నది బోస్ వాదన. ఆలయాన్ని స్వాధీనం చేసుకుంటూ ఎండోమెంట్ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దుచేసి ఆలయాన్ని యధాతధంగా ఉంచాలని ఎంపీ బోస్ కోరారు. అయితే వైసిపీ నాయకులు ఆలయ ఆవరణలో మీటింగ్ పెట్టి ఆలయాన్ని అపవిత్రపరిచారంటూ కూటమి నాయకులు ఆలయ సంప్రోక్షణం చేయడం పెద్ద దుమారం లేపింది

Original source: hmtvlive.com
Read more on Kaizer News